కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తిలో ఓ విద్యార్థి అందరి మెప్పు పొందుతున్నాడు. జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్న రఫిక్... రానున్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సుద్దముక్కపై భారతదేశ పటాన్ని చెక్కాడు. చిత్రలేఖనం ఉపాధ్యాయుడు కీర.. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. విద్యార్థి ప్రతిభను ప్రధానోపాధ్యాయులు రియాజుద్దీన్ ప్రశంసించారు.
విద్యార్థి కళాఖండం... సుద్దముక్కపై భారతదేశం - adoni
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఓ చిన్నోడు వినూత్న ప్రయోగం చేశాడు. సుద్దముక్కపై భారతదేశ పటాన్ని మలిచి ఔరా అనిపించాడు.
సుద్దముక్కపై భారతదేశం