ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిండుకుండలా శ్రీశైలం.. సాగర్​కు చేరుతున్న నీళ్లు - flow

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో... కృష్ణా పరీవాహక ప్రాంతం జలకళను సంతరించుకుంది. జూరాల, శ్రీశైలం నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయం 12 గేట్లలో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

srisailam

By

Published : Aug 10, 2019, 10:05 AM IST

Updated : Aug 10, 2019, 6:09 PM IST

శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం

కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు.. కరవు తీరా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయంలో... 4 లక్షల 12 వేల 690 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు... జూరాల నుంచి కూడా శ్రీశైలానికి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా..... ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883 అడుగుల మేర నీటిమట్టం ఉంది. జూరాల నుంచి శ్రీశైలానికి 5 లక్షలా 32 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఔట్‌ఫ్లో 4 లక్షల 25 వేల 727 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 12 గేట్లలో 10 గేట్లు ఎత్తి.. 3 లక్షల 20 వేల 655 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,796 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 28 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Last Updated : Aug 10, 2019, 6:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details