శ్రీశైలం జలాశయ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. వరద నీటి ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. జూరాల నుంచి..... శ్రీశైలానికి 3 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.... ప్రస్తుత నీటిమట్టం 870.90 అడుగులు దాటింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400... ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42 వేల 378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32 వేల 66 క్యూసెక్కులు విడుదల చేశారు. మరో 14 అడుగుల నీరు పెరిగితే.. శ్రీశైలం నిండినట్టే.
871 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం - rain
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 3 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.
srisailam