ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద

శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ వరద ప్రవాహం భారీగా తగ్గిపోయింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ కారణంంగా.. నామమత్రంగానే నీరు వస్తోంది.

By

Published : Aug 22, 2019, 11:51 PM IST

శ్రీశైలం

శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద

ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం జలశయానికి కృష్ణమ్మ ప్రవాహం భారీగా తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 44 వేల 136 క్యూసెక్కులు ప్రవాహం వస్తుండగా.. దిగువకు 90 వేల 848 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.20 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 210.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29 వేల 882 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 38 వేల 140 క్యూసెక్కులు వదులుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2వేల 26 క్యూసెక్కులు పంపుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details