శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలంలో 34,390 క్యూసెక్కులు నీరు చేరుతోంది. శ్రీశైలంలోని నీటిని ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలు 71వేల 011 క్యూసెక్కులు వినియోగించుకున్నాయి. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 883 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 204.78 టీఎంసీల నిల్వ కొనసాగుతోంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 18వేల 413 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 28వేల 252, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2వేల 400, హంద్రీనీవాకు 2వేల 026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
మరింత తగ్గిన శ్రీశైలం వరద ప్రవాహం - project
శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుతుంది. ప్రస్తుతం వరద నామమాత్రంగానే వస్తోంది.
శ్రీశైలం
Last Updated : Aug 25, 2019, 1:04 AM IST