శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు: మంత్రి వెల్లంపల్లి - devasthanam
శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం విషయంలో.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు.
![శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు: మంత్రి వెల్లంపల్లి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4180719-923-4180719-1566222499940.jpg)
శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు-మంత్రి వెల్లంపల్లి
శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రద్దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ కమిషనర్‌ను ఆదేశించారు. దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. లలితాంబిక సముదాయం పరిధిలోని దుకాణాలకు ఇటీవల జరిగిన వేలంలో వివాదం చోటు చేసుకోవటంపైనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.