కర్నూలు జిల్లా కోడుమూరులో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి తిరునాళ్ల మహోత్సవాలను పురస్కరించుకుని ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహించారు. భూమాత రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలు రెండు రోజుల పాటు... రెండు విభాగాల్లో జరగనున్నాయి. గెలుపొందిన విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పోటీలను ప్రారంభించేందుకు విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహానికి ఆయన మనవడు తెదేపా నాయకుడు కోట్ల రాఘవేందర్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కోట్ల సర్కిల్ నుంచి పాత బస్టాండ్ మీదుగా అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి , కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిని అట్టహాసంగా కోలాటాల మధ్య వాహనంలో ఊరేగించారు.
కోడుమూరులో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు - తెలుగుదేశం నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తాజా
కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ చౌడేశ్వరీ దేవి తిరునాళ్ల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
కోడుమూరులో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు