ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కర్నూలు నగరంలో ఉన్నామా ? లేక పల్లెటూర్లోనా?' - Handhri neeva news today

వారంతా ఉండేది పల్లెటూర్లో కాదు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోనే. కానీ ఆ కాలనీల్లో నీటి సరఫరా లేదు. కర్నూలు చెంతనే తుంగభద్ర, హంద్రి నీవా వంటి జీవనదులు ప్రవహిస్తున్నా.. నగర వాసులకు తాగేందుకు బల్దియా అధికారులు గుక్కెడు నీళ్లు కూడా సరఫరా చేయలేని స్థితిలో ఉన్నారు. ఫలితంగా మంచినీరు సైతం కొనుగోలు చేసి తాగాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

'కర్నూలు నగరంలో ఉన్నామా ? లేక పల్లెటూర్లోనా ?'
'కర్నూలు నగరంలో ఉన్నామా ? లేక పల్లెటూర్లోనా ?'

By

Published : Oct 18, 2020, 4:06 PM IST

మారుమూల గ్రామాలకు సైతం ప్రస్తుత రోజుల్లో కనీస మౌలిక సదుపాయాలు నీరు, రోడ్లు, మురుగు కాల్వ వసతులు అందుతున్నాయి. కర్నూలు నగరంలోని ఓ వార్డులో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కనీస మౌలిక వసతులేవీ ?

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్​ 29 వార్డు శ్రీ సాయినాథ్ ‌నగర్‌లో కనీస వసతులు లేక కాలనీ వాసులు నానా యాతన అనుభవిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం మూడేళ్లుగా ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టు తిరుగుతున్నా కుళాయిలు, మురుగు కాల్వలు, రోడ్డు వేయచ్లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కాల్వలు లేకపోవడంతో మురుగు నీరంత ఇళ్ల ముందే ప్రవహిస్తోంది. మరి కొన్ని నివాసాల చుట్టూ నీటి నిల్వ ఉన్న దుస్థితి నెలకొంది.

'కర్నూలు నగరంలో ఉన్నామా ? లేక పల్లెటూర్లోనా ?'

తాగునీరు కొంటున్నాం..

బల్దియా అధికారులు నీటి సౌకర్యం సైతం కల్పించకపోవడంతో తాగు నీటి కోసం దూర ప్రాంతానికి వెళ్లి తెచ్చుకొంటున్నామని తెలిపారు. వాడుకునేందుకు కూడా నీటి ట్యాంకర్​ మీద ఆధార పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏదైనా జరిగితే ఎలా?

రోడ్లు సరిగ్గా లేనందున వర్షం పడినప్పుడు జారి పడుతున్నామని.. ప్రమాదవశాత్తు జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదంటూ నగర పాలక సంస్థ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

హైదరాబాద్​ను మళ్లీ ముంచెత్తిన వరద.. ప్రజలకు తప్పని అవస్థలు

ABOUT THE AUTHOR

...view details