నేటి నుంచి శ్రీశైలంలో.. మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం : ఈవో - sparsha darshanam at srisailam
20:36 February 16
ఈనెల 21 వరకు స్పర్శ దర్శనం
శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్.లవన్న తెలిపారు. స్పర్శ దర్శనం పునఃప్రారంభిస్తుండటంతో విరామ దర్శనం, సామూహిక, గర్భాలయ అభిషేకకర్తలకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2నుంచి 3 గంటల వరకు భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందన్నారు. జ్యోతిర్ముడి శివదీక్షా భక్తులకు స్పర్శ దర్శనం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్పర్శ దర్శనం నిలిపివేసి, అలంకార దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి