ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానందిలో ఘనంగా పదహారో రోజు పండుగ - కర్నూలు మహానంది తాజా వార్తలు

ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో పదహారవ రోజు పండుగ వైభవంగా జరిగింది. పండుగ సందర్భంగా చండీశ్వరుడు, త్రిశూల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

sixteen days festival in mahanandi
మహానందిలో పదహారు రోజు పండుగ

By

Published : Mar 26, 2021, 7:05 PM IST

ప్రముఖ శైవ క్షేత్రం కర్నూలు జిల్లా మహానందిలో పదహారవ రోజు పండుగ ఘనంగా జరిగింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన అనంతరం 16వ రోజున పండుగలా వేడుక జరుపుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్, వేదండితులు, భక్తులు పాల్గొన్నారు. చండీశ్వరుడు, త్రిశూల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో అక్కడే నిలిపిన రథానికి పూజలు చేశారు. రథాన్ని లాగి మునపటి స్థానంలో ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details