కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఆస్పత్రుల్లోని పడకలు రోగులతో నిండిపోయాయి. మరోవైపు ఆస్పత్రికి వచ్చే పాజిటివ్ రోగుల సంఖ్య పెరగటంతో.. బెడ్స్ లేక కిందనే కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమంది రోగులకు పల్స్ శాతం తక్కువగా ఉండటంతో..కర్నూలు ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమస్యతో మూడు రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందారు. ప్రైవేట్ కొవిడ్ ఆస్పత్రుల్లో కూడా బెడ్స్ రోగులతో నిండిపోయాయి.
పడకల కొరత...రోగుల అవస్థ! - Nandyal news
కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది..పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వృద్ధులతోపాటు యువతపైన కూడా ఈ కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నంద్యాలలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Shortage of beds in Nandyal Government Hospital