తెలంగాణ నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు అక్రమంగా తరలిస్తున్న 100 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ లలితాదేవి పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల సందర్భంగా పట్టణ శివారులోని వెంకటేశ్వరాపురం గ్రామ సమీపంలో తనిఖీలు చేస్తుండగా.. బేతంచెర్లకు చెందిన ముత్యాల మధుసూదన్ ఆటోలో మద్యం సీసాలతో పట్టుపడినట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎస్సై కమలాకర్, హెడ్‌కానిస్టేబుల్ మాలిక్, సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - తెలంగాణ అక్రమ మద్యం ఏపీలో పట్టివేత
తెలంగాణ నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను నంద్యాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్సై కమలాకర్, హెడ్‌కానిస్టేబుల్ మాలిక్, సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
మంత్రాలయం మండలం మాధవరం సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. ఆదోని నుంచి కర్ణాటక రాష్ట్రానికి రెండు ఆటోల్లో తరలిస్తుండగా.. పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 2 ఆటోలు సీజ్ చేసి.. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు