కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని యాటకల్లు, తంగరడోణ, కైరుప్పల గ్రామాలకు చెందిన రైతులు విత్తనాల కోసం ఉదయం ఏడు గంటలకే తరలివచ్చారు. సోమవారం విత్తనాల కోసం పర్మిట్లు రాసి వేలి ముద్రలు సైతం వ్యవసాయ అధికారులు వేయించుకున్నట్లు రైతులు వాపోయారు. మాకు చదువు రాదని... పేపర్ ప్రకటనలు తెలియకపోవడంతో ఉదయం నుంచి 9 గంటల వరకు విత్తనాల కోసం వేచి చూశామని రైతులు అంటున్నారు. వ్యవసాయ అధికారులకు ఫోన్ చేయడంతో విత్తనాలు లేవని.. స్టాక్ అయిపోయిందని వచ్చిన వెంటనే పంపిణి చేపడతామని తెలపటంతో అన్నదాతలు నిరాశతో వెనుదిరిగారు.
విత్తనాల కోసం రైతుల పాట్లు - aspari
కర్నూలు జిల్లా ఆస్పరి మండంలో విత్తనాల కోసం రైతులు ఎన్నో పాట్లు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే బారులు తీరుతున్నారు.
రైతులు