శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే జలాశయానికి 55,011 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం నీటిమట్టం 864.90 అడుగులు ఉండగా, నీటి నిల్వ 122.1236 టీఎంసీలుగా నమోదైంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి 38,140 క్యూసెక్కులు నీరు విడుదలవుతోంది. అలాగే హంద్రీనీవాకు 1,927 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం - కర్నూలు జిల్లా తాజా వార్తలు
శ్రీశైలం జలాశయానికి 55,011 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి 38,140 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 864.90 అడుగులు ఉంది.
స్థిరంగా కొనసాగుతున్న వరద ప్రవాహం