ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో రౌడీ షీటర్ దారుణ హత్య - news updates in nandhyala

కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

rowdy-sheeter-murder-in-nandhyala-kurnool-district
నంద్యాలలో రౌడీ షీటర్ దారుణ హత్య

By

Published : Mar 24, 2021, 9:03 PM IST

కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్... గత కొంత కాలంగా నంద్యాల ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజశేఖర్​ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి హతమార్చారు.

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... హత్యా స్థలిని పరిశీలించారు. మృతుడు గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details