కర్నూలు నగరంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష నగర్‌లో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రిటైర్డ్ ఎస్.ఐ షేక్ అలీ భాషా ఇంట్లో దొంగతనం జరిగి 4 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారం తీసుకెళ్లారు. ఈనెల 1వ తేదీన ఇంటికి తాళం వేసి తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా రేవులపల్లిలోనున్న బంధువుల ఇంటికి వెళ్లి శుక్రవారం తిరిగివచ్చి చుడగా... చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్నూలు ఇంఛార్జ్ డీఎస్పీ బాబా ఫకృద్ధీన్, సీఐ మహేశ్వర రెడ్డి ఇంటిని పరిశీలించి కేసు నమెదు చేసుకున్నారు... దొంగతనం జరిగిన ఇంటిలోని మరో గదిలో పెద్ద మొత్తంలో బంగారు ఉండగా దొంగలు వాటిని గుర్తించలేకపోవడంతో భాదితులు ఊపిరి పీల్చుకున్నారు.
కర్నూలు విశ్రాంత అధికారి ఇంట్లో చోరీ - kurnool
కర్నూలు నగరంలోని విశ్రాంతి అధికారి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైస్ శాఖకు చెందిన ఎస్. ఐ. షేక్ అలీ భాషా ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 4 లక్షల రూపాయలు, 15 తులాల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారు.
కర్నూలు విశ్రాంత అధికారి ఇంట్లో చోరీ