కర్నూలు సమీపంలోని తడకనపల్లె క్రాస్ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
బైక్ను ఢీ కొన్న లారీ.. ఒకరు మృతి - kurnool district latest news
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.
బైక్ను ఢీ కొన్న లారీ..ఒకరు మృతి ,మరొకరికి తీవ్ర గాయాలు
కర్నూలుకు చెందిన షేక్ ఇస్రాక్, సోహేల్ ఇద్దరు మిత్రులు. వీరు బిట్స్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరు కళాశాల నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ ఇస్రాక్ అక్కడికక్కడే మృతిచెందగా..... సోహేల్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.