తెలంగాణ రాష్ట్రానికి చెందిన గరుడ బస్సు 2లారీలను ఢీకొంది. కర్నూలు జిల్లా డోన్ సమీపంలో కంపాలపాడు సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కంపాలపాడు వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండడంతో... ముందు వెళ్తున్న లారీలను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. 15 రోజుల వ్వవధిలో కర్నూలు-డోన్ జాతీయ రహదారిపై మూడు ప్రమాదాలు జరిగాయి.
లారీలను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... 9మందికి గాయాలు - TSRTC
కర్నూలు జిల్లా డోన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గరుడ బస్సు 2 లారీలను ఢీకొంది. 9మందికి గాయాలయ్యాయి.
డోన్ సమీపంలో రోడ్డు ప్రమాదం