ఇంటింటికి రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలను కొందరు తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. మరి కొందరు ఆపద సమయంలో ఎమర్జెన్సీ కింద వినియోగిస్తున్నారు. గతంలో కోసిగి మండల పరిధిలోని దుద్ది గ్రామంలో ఈ వాహనంలో గర్భిణిని ఆసుపత్రికి తరలించి శభాష్ అనిపించుకున్నారు. మంచికి ఉపయోగిస్తే బాగానే ఉంటుంది కానీ ఇలా సొంత పనులకు వినియోగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రావణ మాసం సందర్భంగా కర్నూలు జిల్లాలోని జోహలాపురం గ్రామానికి చెందిన రేషన్ ట్రక్కులో ఓ కుటుంబం ఉరుకుందలోని ఈరన్న దేవాలయానికి వెళ్లారు. దర్శన అనంతరం కోసిగిలోని రేణుక ఎల్లమ్మ గుడి వద్ద సేద తీరుతుండగా మీడియా ప్రతినిధులు వారిని ఆరాతీశారు. వివరాలు అడిగి ఫొటోలు తీస్తుండగా ఫోన్లు లాక్కుని అడ్డుకున్నారు. రేషన్ వాహనంలో ఇలా వెళ్లకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా ప్రయాణిస్తూ ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడారని తెలుస్తోంది. ఈ వాహన డ్రైవర్‌పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు హల్చల్..