రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మూడోవిడత రేషన్ పంపిణీలో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పటం లేదు. వేలిముద్రలు వేసే యంత్రాలు మెురాయించటంతో... గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని 218 రేషన్ దుకాణాల్లో ఇదే దుస్థితి నెలకొంది. వినియోగదారులు లైనులో నిలబడలేక తమతో పాటు తెచ్చుకున్న సంచులను వరుస క్రమంలో పెట్టారు. గత రెండు విడతలగా ఇచ్చిన విధంగానే రేషన్ ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
యంత్రాలు మెురాయింపు... రేషన్ పంపిణీలో ఇబ్బందులు
రాష్ట్రంలో మూడో విడత రేషన్ పంపిణీలో యంత్రాల మొరాయింపు వల్ల లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని చౌకధరల దుకాణాల్లో యంత్రాలు మెురాయించడం వల్ల రేషన్ పంపిణీలో జాప్యం జరుగుతోంది.
నందికొట్కూరులో రేషన్ ఇబ్బందులు