ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

mantralayam: మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం - కర్నూలు జిల్లా మంత్రాలయం

మంత్రాలయం(mantralayam)లో రాఘవేంద్రస్వామి 350వ ఆరాధనోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాముడి అలంకరణలో ఉన్న ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను, మహారథంలో కొలువుదీరిన స్వామిని.. మంత్రాలయం పురవీధుల్లో ఊరేగించారు.

మంత్రాలయంలో కన్నుల పండువగా రథోత్సవం
మంత్రాలయంలో కన్నుల పండువగా రథోత్సవం

By

Published : Aug 25, 2021, 5:16 PM IST

మంత్రాలయంలో కన్నుల పండువగా రథోత్సవం

మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 350వ ఆరాధనోత్సవాల్లో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్తర ఆరాధన సందర్భంగా మతాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. రాముడి అలంకరణలో ఉన్న ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను, మహారథంలో కొలువుదీరిన స్వామిని... మంత్రాలయం పురవీధుల్లో ఊరేగించారు. మహారథంపై హెలికాఫ్టర్‌తో పూలు చల్లారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు.. ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అంతకుముందు వసంతోత్సవం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details