కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 'మీకోసం ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులకు వివరించారు. రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులను ప్రజాప్రతినిధులు ఆ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో వ్యాప్తంగా ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని...ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఆళ్లగడ్డలో ప్రజాదర్బార్... వెల్లువెత్తిన ఫిర్యాదులు - ప్రజాదర్బార్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నారు.
ఆళ్లగడ్డలో ప్రజాదర్బార్...వెళ్లువెత్తిన ఫిర్యాదులు