కర్నూలు జిల్లా సిరివెళ్ల 40వ నెంబర్ జాతీయ రహదారిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేటు బస్సు ఆపి సోదా చేయగా 217 తెలంగాణ మద్యం సీసాలను గుర్తించారు. పక్కరాష్ట్రంలో తక్కువ ధరకు లభించే మద్యాన్ని కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించేందుకు అక్రమార్కులు ఈ విధంగా సరఫరా చేస్తున్నారన్నారు.
అక్రమ రవాణాకు సంబంధించి ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామానికి చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.