కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు సమీపంలో అలుగు వాగులో కారుతో సహా చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను నందివర్గం పోలీసులు స్థానికుల సహకారంతో కాపాడారు. అనంతపురానికి చెందిన భాస్కర్, ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తులు తెల్లవారుజామున కారులో నంద్యాలకు బయలుదేరారు. టంగుటూరు సమీపంలోని అలుగు వాగులో చిక్కుకుపోయారు. బాధితులు వెంటనే 100 నెంబరుకు ఫోన్ చేయగా పోలీసులు స్పందించారు. పాణ్యం సీఐ జీవన్ గంగనాథబాబు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి వారిని కాపాడారు. అనంతరం కారును బయటకు లాగారు.
వాగులో చిక్కుకున్న కారు..ఇద్దరిని కాపాడిన పోలీసులు - అలుగు వాగులో చిక్కుకున్న వ్యక్తులు
ఇద్దరు వ్యక్తులు కారులో బయలుదేరారు. వాగులో కారు చిక్కుకుపోయింది. అయినా తెలివిగా ఆలోచించి పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చేవరకు కారుపైన కూర్చుని ప్రాణాలు కాపాడుకున్నారు. పోలీసులు స్పందించి సంఘటనా స్థలానికి వచ్చి వారిని రక్షించారు. తర్వాత కారును స్థానికులతో కలిసి బయటకు లాగారు. ఈ ఘటన కర్నూలు జిల్లా టంగుటూరు సమీపంలో జరిగింది.
వాగులో చిక్కుకున్న కారును బయటకు లాగుతున్న స్థానికులు