ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder: రక్షించాల్సినవాడే.. ప్రాణాలు తీశాడు..! - కర్నూలు జిల్లా క్రైం వార్తలు

ఎవరికైనా సమస్య వస్తే పరిష్కరించాల్సిన బాధ్యతలో ఉన్న వాడు.. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాల్సినవాడు.. ఇంత ఉన్నతమైన ఉద్యోగం చేసే ఆ వ్యక్తి.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఎన్నో వేధింపులకు గురిచేసే..మాస్టర్​ ప్లాన్​తో హత్యచేసి కటకటాలపాలయ్యాడు.

police killed his wife at kurnool
రక్షించే పోలీసే ప్రాణాలు తీశాడు..!

By

Published : Sep 13, 2021, 6:16 PM IST


ప్రజలను రక్షించే పోలీసే.. తన భార్యను వేధించి, చంపేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. జిల్లాలోని కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ధరణి అనే మహిళను.. తన భర్త చంద్రశేఖర్ హత్య చేశాడు. చంద్రశేఖర్ కర్నూలు రెండవ పట్టణ పోలీసు స్టేషన్​లో.. విధులు నిర్వహిస్తున్నాడు. మూడు నెలలుగా ధరణిని అత్తింటివారు వేధింపులకు గురి చేస్తున్నారని మృతిరాలి తల్లి తెలిపారు. అన్నంలో మత్తు మందు కలిపి.. నిద్రపోయిన సమయంలో దిండుతో ఊపిరి ఆడనీయకుండా చంపారని ఆమె ఆరోపించారు. ఘటనపై తాలూకా పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details