ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో చౌక దుకాణాల వద్ద ప్రజల బారులు

లాక్​డౌన్ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ పంపిణీ కర్నూలులో ప్రారంభమైంది. చౌక ధరల దుకాణాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు.

people standing in que  at ration shops in karnool
చౌకదుకాణాల వద్ద ప్రజల బారులు

By

Published : Mar 29, 2020, 7:41 PM IST

కర్నూలులో చౌకదుకాణాల వద్ద ప్రజల బారులు

లాక్​డౌన్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో తెల్ల రేషన్​ కార్డుదారులకు 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. సరుకులు తీసుకునేందుకు ప్రజలు చౌక ధరల దుకాణాల వద్ద బారులు తీరారు. సామాజిక దూరం పాటిస్తూనే సరుకులు తీసుకున్నారు. రైతు బజార్ల వద్ద కూడా ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజలు బాధ్యతగా ఉంటున్నా.. మరికొన్ని చోట్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు.

నంద్యాలలోనూ

నంద్యాలలో చౌక దుకాణం వద్ద ప్రజల బారులు

ఉచిత రేషన్​ కోసం నంద్యాలలోనూ ప్రజలు ఉదయం నుంచే చౌక దుకాణాల వద్ద బారులు తీరారు. అధికారుల సూచన మేరకు జనం సామాజిక దూరం పాటించి సరుకులు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details