పాఠశాలలకు చేరుతున్న కొత్త పాఠ్య పుస్తకాలు - books
త్వరలో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున విద్యార్థులకు పంపిణీ చేయడానికి కొత్త పుస్తకాలను విద్యాశాఖ సిద్ధం చేస్తోంది. 2019-2020కి సంబంధించిన పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో పాఠ్యపుస్తకాలు
కర్నూలు జిల్లా కోడుమూరు మండల విద్యా వనరుల కేంద్రం నుంచి పాఠశాలలకు పుస్తకాల పంపిణిని ఎంపీపీ రఘునాథ రెడ్డి, ఎంఈవో అనంతయ్య ప్రారంభించారు. మొదటి విడతగా 34,512 పుస్తకాలను మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్నట్టు ఎంఈవో తెలిపారు. ఆర్టీసీ బస్సుల ద్వారా పుస్తకాలను మండలంలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలకు పంపుతున్నామని అన్నారు. తరగతులు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు అందజేయనున్నట్లు చెప్పారు.