ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వింటాలు ఉల్లి@ 10 వేల రూపాయలకు పైనే...! - onions latest news

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా... చాలా మంది రైతులు ఉల్లి పంట వేయలేదు. మరోవైపు ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరిగింది.

క్వింటాలు ఉల్లి 10 వేల రూపాయలకు పైనే...!
క్వింటాలు ఉల్లి 10 వేల రూపాయలకు పైనే...!

By

Published : Dec 2, 2019, 11:53 PM IST

కర్నూలు మార్కెట్‌లో ఉల్లి.. రికార్డు ధర పలికింది. క్వింటాల్‌ ఉల్లి 10 వేల 180 రూపాయల ధరకు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. వారం రోజుల క్రితం... క్వింటాలు ఉల్లి 7 వేల 400 పలకగా... ఇవాళ 10 వేలకు పైగా పలికి కొత్త రికార్డును సృష్టించింది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, బనగానపల్లి, డోన్ నియోజకవర్గాల్లో సుమారు 30 వేల హెక్టార్లలో ఉల్లిని సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా... చాలా మంది రైతులు పంట వేయలేదు. భారీ వర్షాలకు వేసిన పంట కుళ్లిపోయింది. మరోవైపు ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరిగింది.అయితే పదివేలు పలకడం వల్ల కర్నూల్‌ ఉల్లి రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం మార్కెట్‌కు వెయ్యి క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వస్తోంది. వ్యాపారులతో పోటీపడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉల్లిని కొనుగోలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details