ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లి ధరలు పతనం..ఆవేదనలో అన్నదాతలు - ఉల్లి ధరలు తాజా వార్తలు

నిన్న మొన్నటి వరకు వినియోగదారులకు కన్నీరు పెట్టించిన ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఓ వైపు తగ్గిన ధరలతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. పడిపోయిన రేట్లతో పెట్టుబడి కూడా రావటం లేదని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లి ధరలు పతనం
ఉల్లి ధరలు పతనం

By

Published : Mar 16, 2021, 6:04 PM IST

బహిరంగ విపణిలో నిన్నటి వరకు రూ. 50 పలికిన కిలో నాణ్యమైన ఉల్లి.. ఇప్పుడు రూ. 20 కూడా పలకటం లేదు. తగ్గిన ధరలతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తుండగా..రైతన్నలు మాత్రం ఆవేదనలో ఉన్నారు. తమకు కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు.

కర్నూలు జిల్లాలో రబీలో సుమారు 3 వేల హెక్టార్లలో ఉల్లిని సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. కర్నూలు ఉల్లి మార్కెట్​కు 4 వందల నుంచి 5 వందల టన్నుల వరకు సరకు వస్తోంది. ఎకరం విస్తీర్ణంలో ఉల్లిని సాగు చేయటానికి సుమారు రూ. లక్ష పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం క్వింటా ధర సరాసరిన వెయ్యి నుంచి 13 వందల రూపాయల వరకు పలుకుతోంది. దీనివల్ల తమకు నష్టాలు వస్తున్నాయని..రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటి వరకు కర్నూలు ఉల్లి మార్కెట్​లో క్వింటా ధర 3 వేల నుంచి 4 వేలకు పలికింది. ఈ ధరలతో రైతన్నల కళ్లలో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం దేశంలోనే ఉల్లిని అధికంగా పండించే మహారాష్ట్ర నుంచి దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. కర్నూలు జిల్లాలోనూ దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఫలితంగా విపణిలో ఉల్లిగడ్డలు సరిపడా ఉండటంతో..ధరలు దిగి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

మహారాష్ట్ర సహా గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుబడులు అధికంగా వస్తే..కర్నూలు మార్కెట్​లో ధరలు మరింత క్షీణించే అవకాశం లేకపోలేదు.

ఇదీచదవండి

కర్రల వంతెన...తీరింది యాతన!

ABOUT THE AUTHOR

...view details