Onion farmers Problems: కర్నూలు జిల్లా ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాలు, ఇతర కారణాల వల్ల గతేడాది దిగుబడి బాగా తగ్గింది. ఈసారి పంట దిగుబడి బాగా ఉన్నా.. మార్కెట్‌లో సరైన ధర లేని కారణంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పొలంలోని పంటను వదిలేయలేక, మార్కెట్‌లో అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌లో ఉల్లి ధరలు 3 వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఉల్లిగడ్డకు రూ.500 కంటే ఎక్కువ రావటం లేదు. చేతికొట్టిన పంటను కోసి మార్కెట్‌కు తరలించాలంటే కూలీలు, రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. మార్కెట్‌లో లభించే ధర ఏ విధంగానూ గిట్టుబాటు కాకపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని ఉల్లి రైతులు కోరుతున్నారు.
Onion farmers Problems: కర్షకులను కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి..! - కర్నూలు జిల్లా ఉల్లి రైతుల సమస్యలు
Onion farmers Problems: కర్నూలు జిల్లా ఉల్లి రైతులను కష్టనష్టాలు వెంటాడుతున్నాయి. పొలంలోని పంటను వదిలేయలేక.. మార్కెట్‌లో అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యమైన గడ్డకు 500 రూపాయలకు మించి రావడం లేదు. చేతికొచ్చిన పంటను కోసి మార్కెట్‌కు తరలించాలంటే కూలీలు, రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. మార్కెట్‌లో లభించే ధర ఏ విధంగానూ గిట్టుబాటు కాకపోతుండటంతో ఉల్లి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఉల్లి రైతుల కష్టనష్టాలు