కర్నూలు నగరంలో కొత్తబస్టాండ్ ఎదుట రోడ్డుపై ఉల్లి రైతులు బైఠాయించారు. మార్కెట్లోని ఉల్లిని కొనుగోలు చెయ్యాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వ్యాపారస్తులు ఉల్లిని కొంతసేపు మాత్రమే కొనుగోలు చేసి నిలిపివేయటం వల్ల మార్కెట్ లో నిల్వలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. ఉల్లి ధర తగ్గించేందుకు వ్యాపారస్తులు ఏకమై కొనుగొళ్లు నిలిపివేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పై బైటాయించిన తమను పట్టించుకునే నాథుడేలేరని రైతులు వాపోయారు. పోలీసులు సర్థిచెప్పినా...రైతులు ఆందోళన కొనసాగించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
'మార్కెట్లోని ఉల్లిని కొనుగోలు చెయ్యండి' - కర్నూలు నగరం
కర్నూలులోని కొత్తబస్టాండ్ ఎదుట ఉల్లి రైతులు ధర్నా నిర్వహించారు. ఉల్లి ధర తగ్గించేందుకు వ్యాపారస్థులు ఏకమై కొనుగోళ్లను నిలిపివేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
'మార్కెట్లోని ఉల్లిని కొనుగోలు చెయ్యండి'