ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి - నందికొట్కూరు నేటి వార్తలు

కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులను కష్టాలు వీడటం లేదు. ఎమ్మిగనూరు మార్కెట్​లో సరకు నాణ్యతగా లేదని అధికారులు కొనుగోలును తిరస్కరించారు. అకాల వర్షాలతోనూ తాము నష్టపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

onion crop farmers problems in kurnool district
నందికొట్కూరు మార్కెట్లో ఉల్లినిల్వలు

By

Published : May 6, 2020, 8:56 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్​లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉల్లి కొనుగోలు కేంద్రంలో... సరకు నాణ్యతగా లేదని అధికారులు తిరస్కరించారు. మరో వైపు జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉల్లిని అధికంగా సాగు చేసే ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి రైతులు పంట అమ్ముకునేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1500 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు. గ్రేడింగ్​తో కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోందని రైతులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details