కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన హుస్సేన్ భాషా(8), హుస్సేన్ బీ(4), జమాల్ బీ(8) ముగ్గురూ స్థానిక దుకాణంలో బిస్కెట్లు కొని తిన్నారు. కొంతసేపటి తర్వాత వారు అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ హుస్సేన్ భాష మృతి చెందాడు. హుస్సేన్ బీ, జమాల్ బీ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో వారిని కర్నూలుకు తరలించారు. తమ కళ్ల ముందే ఆడుతూ... తిరుగుతున్న పిల్లలు ఒక్కసారిగా కుప్పకూలిపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చింతకొమ్మదిన్నెలో విషాదం.. బిస్కెట్లు తిని బాలుడు మృతి - kurnool district crime
కర్నూలు జిల్లా చింతకొమ్మదిన్నె గ్రామంలో విషాదం జరిగింది. బిస్కెట్లు తిని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
చింతకొమ్మదిన్నెలో విషాదం