Lokesh Selfie Challenge to CM Jagan రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నయ్ ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన తెలుగు గంగ ప్రాజెక్టును యువనేత, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సందర్శించారు. పాదయాత్రలో భాగంగా వెలుగోడు చేరుకున్న లోకేశ్... ఆసియాలో అతిపెద్దదైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించారు. 16.4 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నయ్ కి తాగునీరు అందుతోంది.1996 సెప్టెంబర్ 23న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి తొలిసారిగా చెన్నయ్ కి నీళ్లు వెళ్లాయి. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడుల ముందుచూపు, వారికి కరువుసీమపై వారికున్న ప్రేమకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని యువనేత లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెలుగోడు రిజర్వాయర్ దిగువన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి లోకేశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
లోకేశ్ సెల్ఫీ విడుదల:ఇది మా తాత కట్టిన తెలుగుగంగ... నువ్వు పిల్లకాల్వ అయినా తవ్వావా జగన్ ? అంటూ లోకేశ్ సెల్ఫీ విడుదల చేశారు. రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నయ్ వాసులకు తాగునీరు అందించాలన్న విశాల దృక్పథంతో మా తాత ఎన్టీఆర్ కట్టిన తెలుగుగంగ ప్రాజెక్టు ఇది అని లోకేశ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 1.75లక్షల ఎకరాలకు సాగునీరు అందడమేగాక చెన్నయ్ వాసుల దాహార్తి తీరుతోందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి దోచుకోవడం, దాచుకోవడమే తప్ప రాయలసీమ ప్రజలకోసం ఒక్క పిల్లకాల్వ అయినా నిర్మించావా జగన్మోహన్ రెడ్డీ?!అంటూ నారా లోకేశ్ వైఎస్ జగన్పై ధ్వజమెత్తారు.