ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాల పోస్టల్ డివిజన్​కు రెండు పురస్కారాలు - గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియం

నంద్యాల పోస్టల్ డివిజన్​కు రెండు పురస్కారాలు లభించాయి. గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియం వసూలు చేయటంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఒక పురస్కారం లభించగా.. డిజిటల్ లావాదేవీలలో ప్రథమ స్థానంలో నిలవడంతో మరో పురస్కారం లభించినట్లు నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్ బాల సత్యనారాయణ తెలిపారు.

nandyala postal circle won two awards
నంద్యాల పోస్టల్ డివిజన్​కు రెండు పురస్కారాలు

By

Published : Feb 22, 2021, 9:35 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల పోస్టల్ డివిజన్​కు రెండు పురస్కారాలు లభించాయి. గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియం వసూలులో రూ.3 కోట్ల లక్ష్యానికి గాను దాదాపు రూ.2.30 కోట్లు వసూలు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ సర్కిల్​లోనే అత్యధికమని తెలిపింది. ఇందులో ప్రథమ స్థానంలో నిలిచినందుకు పురస్కారం వచ్చినట్లు నంద్యాల పోస్టల్ సూపరింటెండెంట్ బాల సత్యనారాయణ తెలిపారు. బ్రాంచి పోస్టాఫీసులో డిజిటల్ లావాదేవీలు ప్రథమ స్థానంలో ఉండడంతో మరో పురస్కారం లభించినట్లు ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details