''హిందూ ముస్లిం అనే బేధాలు మాకుండవు. మేమంతా మానవులమే.. ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తాం'' అని అంటున్నారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రజలు. అయ్యప్ప స్వామి దీక్ష ధరించిన వారికి బిక్షను అందించిన ముస్లింలు మత సామరస్యాన్ని చాటుకున్నారు. పట్టణంలో శ్రీ కోదండరామ దేవాలయంలో అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. అంతా కలిసి భక్తి భావంతో.. ఐకమత్యం చాటుతూ భోజనం చేశారు.
అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుల బిక్ష - latest news in nandyala
ఏ కులమైనా సోదర భావంతో మెలగాలన్న మాటలను అక్షరాల నిజం చేశారు ఆళ్లగడ్డ వాసులు. అయ్యప్ప దీక్షలో ఉన్న హిందూ భక్తులకు ముస్లిం సోదరులు బిక్ష ఏర్పాటు చేశారు. మత సామరస్యాన్ని చాటారు.
అయ్యప్ప స్వాములకు ముస్లిం సోదరుల బిక్ష
TAGGED:
latest news in nandyala