నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్ కర్నూలు నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. స్పిరిట్, కారామల్, నీళ్లను పాతమద్యం బాటిళ్లలో కలిపి నకిలీ మద్యం తయారుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మద్యం తాగడం వల్ల ప్రాణహాని ఉంటుందని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, అదుపులో ఉన్న ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు విచారిస్తున్నారు.