కర్నూలు జిల్లా వెల్దుర్ది మండలం కృష్ణాపురం గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో.. ఓ నిండు ప్రాణం బలవ్వగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేసే విషయంలో రెండు వర్గాల మధ్య మనస్పర్థలు వచ్చాయి. చెత్తబండిలో వ్యర్థాలు వేసే సమయంలో శనివారం వాగ్వాదం జరిగింది. నాగమ్మ అనే మహిళ కుమారుడు, మాజీ సర్పంచ్ అయిన వెంకట్రాముడు.. అదే రోజున వెల్దుర్ది పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మరో వర్గానికి చెందిన వారు నాగమ్మ, అతని కుమారుడు సుంకన్నతోపాటు, లక్ష్మీదేవి, వెంకటస్వామి, సామన్న, ఎల్లరాజులపై దాడి చేశారు. ఇరువర్గాల వారు రాళ్ల దాడికి దిగారు. నాగమ్మ తలకు తీవ్ర గాయమై.. ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘర్షణలో ఇరువర్గాల వారు తీవ్రగాయలపాలయ్యారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు.. పూర్తి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణపై కొట్లాట.. మహిళ మృతి - పారిశుద్ధ్య పోట్లాటలో ప్రాణం పోయింది
ఇరు వర్గాల దాడిలో ఓ మహిళ ప్రాణం బలైంది. పారిశుద్ధ్య నిర్వహణ విషయమై జరిగిన వాగ్వాదమే ఇంతటి దారుణానికి దారి తీసింది. కర్నూలు జిల్లా కృష్ణాపురం గ్రామంలో ఈ విషాదం జరిగింది.
పారిశుద్ధ్య పోట్లాటలో ప్రాణం పోయింది