ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు నుంచి కేబినెట్​కు వెళ్లింది వీళ్లే

రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. ముఖ్యమంత్రి జగన్‌ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లకు ఎక్కువగా అవకాశమిచ్చారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కింది

కర్నూలు నుంచి కేబినెట్​కు వెళ్లింది వీళ్లే

By

Published : Jun 8, 2019, 8:40 AM IST

కర్నూలు జిల్లా డోన్ నుంచి విజయం సాధించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ మంత్రివర్గంలో స్థానం సాధించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన... 2014, 2019లో వైకాపా తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు డోన్ నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. 2014లో విజయం సాధించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... పీఏసీఛైర్మన్ గా పని చేశారు.

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
నియోజకవర్గం: డోన్‌
వయస్సు: 47
విద్యార్హత: బీఈ
రాజకీయ అనుభవం: రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం. పీఏసీ ఛైర్మన్‌గానూ పనిచేశారు.

() కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన గుమ్మనూరు జయరాం.... జగన్ మంత్రివర్గంలో స్థానం సాధించారు. జయరాం.... 1967లో గుమ్మనూరు గ్రామంలో జన్మించారు. 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2014లో తొలిసారి వైకాపా తరపున పోటీచేసి గెలుపొందారు. తాజా ఎన్నికల్లోనూ... కోట్లసుజాతమ్మపై విజయం సాధించారు. జగన్ కేబినేట్ లో చోటు దక్కించుకున్నారు.

గుమ్మనూరు జయరాం
నియోజకవర్గం: ఆలూరు
వయస్సు: 51
విద్యార్హత: పదోతరగతి
రాజకీయ అనుభవం: జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఇదీ చదవండి

అనుభవం... విధేయతకు అవకాశం

ABOUT THE AUTHOR

...view details