ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వార్డెన్ల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: మంత్రి జయరాం - girl hostal wardens

విద్యార్థినుల వసతి గృహాల వార్డెన్​ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. వారి బాధలను విన్న మంత్రి ఈ మేరకు భరోసా కల్పించారు.

మంత్రి గుమ్మనూరు జయరాం

By

Published : Sep 30, 2019, 11:26 PM IST

వార్డెన్​ల సమస్యలపై మంత్రి స్పందన

ఏపీ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం సందర్బంగా కర్నూల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. నగరంలోని ఎస్టీయు భవన్‌లో నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. వార్డెన్ ఉద్యోగులు తమ కష్టాలను మంత్రికి వివరించారు. కుటుంబసభ్యులతో గంటసేపు కుడా గడపడానికి వీలులేకుండా విధులు నిర్వహిస్తున్నామని వారు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి... సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వారికి హమీ ఇచ్చారు. మహిళలు ఈ సందర్బంగా మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details