గుమ్మనూరులో పేకాట వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జయరాం స్పష్టం చేశారు. పేకాట శిబిరంపై దాడిచేసిన పోలీసులను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. దాడి వెనుక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని మంత్రి అన్నారు. పేకాట, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలన్నారు. గత ఆరేళ్లుగా ఆలూరులో నివసిస్తున్నానని తెలిపారు.
ఆ పేకాట వ్యవహారంతో నాకు సంబంధం లేదు : మంత్రి జయరాం - కర్నూల్ జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా గుమ్మనూరులో పేకాట వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. పోలీసులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పోలీసులకు తన పూర్తి సహకారం అందిస్తానని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి గుమ్మనూరు జయరామ్