'వైద్య కళాశాలను మరో చోట నిర్మించండి' - 'వైద్య కళాశాలను మరో చోట నిర్మించండి'
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయవద్దని రైతు సంఘం నాయకులు మంత్రి ఆళ్లనానికి విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే పరిశోధనా స్థానాన్ని ఇక్కడే ఉంచాలని కోరారు.
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్మించ తలపెట్టిన వైద్యకళాశాలను మరో చోట ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సమితి సభ్యులు, రైతు సంఘాల నాయకులు విన్నవించారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో భూముల పరిశీలనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి వారు వినతిపత్రం అందజేశారు. రైతులకు ప్రయోజనం చేకూర్చే పరిశోధనా స్థానాన్ని ఇక్కడే ఉంచాలని రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి సముచిత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.