భార్య ఆత్మహత్య- భర్తపై అనుమానం! - suicide
కడపజిల్లా అల్లూరి సీతారామరాజు నగర్లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భార్య, భర్తల మధ్య వివాదాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కడపజిల్లా అల్లూరి సీతారామరాజునగర్‌లో గంగాదేవి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మల్లికార్జున్‌తో ఏడేళ్ల క్రితమే వివాహమైంది. పండ్ల వ్యాపారం చేసే మల్లికార్జున్.... ఈమెను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య ఆత్మహత్య చేసుకునే చనిపోయింది. ఇప్పుడు ఈమెదీ బలవన్మరణమే. భార్య, భర్తల మధ్య చాలా కాలంగా సఖ్యత లేదని... తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సమీప బంధువులను విచారిస్తున్నారు. మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.