కరోనా వచ్చి ఉంటుందన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. నగరంలోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని కే.వీ.ఆర్. గార్డెన్లో నివాసం ఉంటున్న జాకీర్ హుసేన్ రెండు రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. కరోనా అనుమానంతో ఓ ప్రైవేటు ల్యాబ్ లో కరోనా నిర్ధారణ కోసం నమూనాలు ఇచ్చారు. కరోనా వస్తుందని భయం పెట్టుకున్నాడు.
కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య.. ఆ తరువాత.. - man died over corona fear
కర్నూలు నగరం కే.వీ.ఆర్ గార్డెన్లో విషాదం చోటుచేసుకుంది. కరోనా వచ్చి ఉంటుదన్న భయంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలనీకి చెందిన జాకీర్ హుసేన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి...కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు. ఫలితాలు రాకముందే వైరస్ సోకిందనే అనుమానంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం వచ్చిన ఫలితాల్లో అతనికి నెగిటివ్ వచ్చింది.
కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య !
కుటుంబసభ్యులు అందరు ఆసుపత్రిలో ఉండగా స్నానం చేసి వస్తానని జాకీర్ ఇంటికి వచ్చాడు. ఇంట్లోఎవరు లేకపోవడంతో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి నుంచి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా జాకీర్ హుసేన్ బలన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం వచ్చిన ఫలితాల్లో మృతుడికి నెగిటివ్ వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.