మయూర వాహనంపై ముక్కంటి విహారం - shiva
కర్నూలు జిల్లా మహానందిలో శ్రీ కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మయూర వాహనంపై విహరించారు.
మహానందిశ్వరుడు
మహా శివరాత్రి ఉత్సవాలు కర్నూలు జిల్లా మహానందిలో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకామేశ్వరీసమేత మహానందీశ్వర స్వామివారికి వివిధ వాహనసేవలు కన్నులపండుగగా నిర్వహించారు. మయూరవాహనంపై స్వామిఆసీనుడై విహరించారు. వేదపండితులు నీలకంఠునికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి వేళ స్వామివారిని పుష్పవాహనంపై విహరింపజేసేందుకుఅధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం గంగాధరుని రథోత్సవం జరగనుంది. గురువారం త్రిశూల స్నానం, తెప్పోత్సవం నిర్వహిస్తారు.