కర్నూలు జిల్లాలోని బనగానపల్లి నుంచి కోవెలకుంట్ల సిమెంట్‌ను తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ గుణకు గుండెపోటు రావడంతో లారీని పొలాల్లోకి మళ్లించాడు. గమనించిన స్థానికులు.. లారీ వద్దకు వెళ్లగా అప్పటికే గుణ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడు తమిళనాడువాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమదాలమెట్టలో విషాదం.. గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి - kurnool district crime news
లారీ డ్రైవింగ్ చేస్తుండగా.. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో లారీలోనే డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం ఆమదాలమెట్ట సమీపంలో జరిగింది.
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి