కర్నూలులో లాక్ డౌన్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం నిత్యావసర సరకులు కొనుగోలు సమయాన్ని పట్టణ ప్రాంతాల్లో పదకొండు గంటల వరకే తగ్గించింది. కర్నూలు నగరంలో ప్రజలు ఉదయాన్నే బయటికి వచ్చి అవసరమైన సరకులు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లోసైతం అధికారులు రైతుజజార్ ఏర్పాటు చేశారు. రేషన్ సరకులు తీసుకునేందుకు నగరవాసులు బారులు తీరారు. సర్వర్ స్లో కావడంతో కొన్ని చౌక దుకాణాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి లైన్లో నిలబడినా ప్రభుత్వం అనుమతించిన 11 గంటల సమయం దాటి పోవడం వల్ల పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు కొందరు దాతలు ముందుకు వచ్చారు. పేదలు నివాసముంటున్న పలు కాలనీల్లో కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకూడదని వారు కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు కూరగాయలు పంపిణీ చేయడం వల్ల పేదల హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలులో ప్రశాంతంగా లాక్డౌన్
కర్నూలులో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఉదయాన్నే బయటికి వచ్చి అవసరమైన సరకులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కోసం ప్రజలు సామాజిక దూరంలో ఉంటూ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. సర్వర్ స్లో కావడంతో కొన్ని చౌక దుకాణాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కర్నూలులో కొనసాగుతున్న లాక్ డౌన్