కర్నూలులో లాక్డౌన్ను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఉదయం 11 గంటలు దాటిన తరువాత రహదారులపైకి వచ్చేవారి వివరాలను ఆరా తీస్తున్నారు. సరైన కారణం చెప్పకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్ల వద్దే ఉండే ప్రభుత్వానికి సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
'కారణం లేకుండా ఇళ్లనుంచి బయటకు వస్తే చర్యలే'
కర్నూలులో జిల్లాలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పోలీసులు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కర్నూలులో మరింత పటిష్టంగా లాక్డౌన్
నగరంలోని అమ్మవారిశాల వద్ద మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు శ్రీనివాసులు వివరించారు.
ఇదీ చదవండి:నంద్యాలలో పటిష్టంగా లాక్డౌన్.. ఇంటి వద్దకే నిత్యావసర సరకులు