ఆళ్లగడ్డలో బంగారు దుకాణాలపై ఆకస్మిక దాడులు - లీగల్ అండ్ మెట్రాలజీ
జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆళ్లగడ్డలోని బంగారం దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తూకాల్లో తేడాలున్న షాపులకు జరిమానా విధించారు.
ఆళ్లగడ్డలో బంగారు దుకాణాలపై ఆకస్మిక దాడులు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బంగారు దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తూకంలో తేడాలున్న 10 దుకాణాలను గుర్తించి 70 వేల రూపాయలు జరిమానా విధించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒక ఎంజీ తూకం చూపించే యంత్రాలను ప్రతి దుకాణదారుడు వినియోగించాలని... లేకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.