మంత్రుల బస్సు యాత్రలో.. ఢీకొన్న నేతల వాహనాలు! - Ministers Bus yatra accident news
16:19 May 29
స్వల్పంగా దెబ్బతిన్న 2 కార్లు.. మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేమం
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద వైకాపా నాయకుల కార్లను.. ఆ మార్గంలో ప్రయాణించిన వాహనాలు ఢీకొన్నాయి. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా వెళుతున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కారు అకస్మాత్తుగా ఆగింది. ఈ క్రమంలో వెనుకనుంచి కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే కార్లలో ఉన్న నాయకులెవరికీ ఇబ్బంది కలగలేదు. ఈ ప్రమాదానికి కారణం మీరంటే మీరంటూ నాయకుల అనుచరులు, సాధారణ వాహన ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి: